నా అడుగులకు ప్రోత్సాహం:
జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం
కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం
~ మౌనశ్రీ మల్లిక్ అన్నయ్య
సినీగేయ రచయిత
------------------------------
ఇక నేను..
కవి, రచయిత.
అధినేత,
లోగిలి వేదిక & మహారథి పబ్లిషర్స్.
ఎడిటర్, లోగిలి ఈ - మ్యాగజైన్.
------------------------------
వృత్తి: ఆంగ్ల ఉపన్యాసకులు
------------------------------
పుస్తక పఠనం📚
సాహితీ సృజన✒️✒️
సాహిత్య విశ్లేషణ🖋️🖋️
------------------------------
Poet, writer
Chief, Logili Vedika.
Maharathi Publishers.
Editor, Logili e - Magazine (Monthly)
------------------------------
App: https://play.google.com/store/apps/details?id=com.logilivedika.app
Website: https://www.logilivedika.com
------------------------------
📌 Started Journey as Poet in2003
📌 Established Logili Vedika &
Inaugurated 'Viswamantha Vistharinchalani' an anthology of poetry with 105 poems by 21 poets on 16. June 2019
📌 Organized National Poetry on 15. Dec.2019
📌 Rooted Logili E- Magazine on 05. June. 2020
------------------------------
Professionally: English lecturer ------------------------------
Reading Books 📚
Creative Literature 📄🖋️
Book Analyst 📒
------------------------------
ఉదయాలు అనాధ శిశువులు కాదు
అదృశ్యం దృశ్యమయ్యే వేళ
రాత్రి కుంపటిపై నిప్పు పుల్లలేస్తే
స్తబ్దత ను ఛిద్రం చేస్తూ
ప్రభవించే రహస్తంత్రి గీతాలు
పొక్కిలిబడ్డ బతుకుల్లో వెలుతురు గేయాలు
వాటిని శృతి చేసేది అరణ్యసీమల్లోనే..
దుఃఖాన్ని మాత్రమే విందుకు పిలువ్
ఉదయాహారం దానికే అవసరం నేడు
మహారథి
------------------------------
చితిని చిగురించేది
మృతిని బ్రతికించేది
జీవన్మరణాల మధ్య
జీవితాన్ని శాసించే శత్రువు - ప్రేమ
మహారథి
------------------------------
నిప్పు రవ్వలు నిద్రపోవు
సామాన్యుల తరఫున
ప్రశ్నించేవాడు లేని నాడు
అరణ్యాలు రుధిరం పులుముకుంటాయ్..
రౌద్రం దాచుకుంటాయ్..
రణానికి తెగబడతాయ్..
లేనోడి గూడు గోడు
ఆ కరోన్ముక్త రక్త జలపాత తరంగాలౌతాయ్..
చిక్కు చీకటి వనసీమలలో
కన్నీటి కథల క్షోభాగ్నికి
విప్లవాగ్ని రగులుతుంది
మౌనముద్రలో ఉన్న
అడవి గర్భంలో సాహసం భగ్నమౌతుంది
దోపిడీ చర నుండి కష్టజీవుల స్వర్గ విముక్తికై
తుపాకీ ధరించిన యుద్ధ వైణికులు
నెత్తుటి వాగులలో ఇంకిపోతారు
అప్పటి దాకా నిగ్గదీసి అడిగినవాడిపై గెలవలేక
ఏలినోళ్లు ఆ శవాలపై గెలుపు దండోరా వేస్తారు
ఆగిపోయిందని ఊపిరి పీల్చుకుని
నిప్పురవ్వలు నిద్రపోయాయనుకునేలోపే..
పాదం కింద అణచబడ్డ గడ్డిపోచలు
గర్జించే సమయం వచ్చేస్తుంది
మళ్ళీ కారడవులు ఉద్యమ తీరాలౌతాయ్..
మహారథి
Published Poem in National Journal
------------------------------
సహస్ర బాహువులు లాగుతున్న కవితా రథాన్ని నేను.✒️✒️
------------------------------
From Bharath 🇮🇳
భరత ఖండము 🇮🇳
------------------------------