Poet ❤️
Atheist
https://www.facebook.com/siddhardha9999.katta
❤️ లోపలికి ❤️ siddhardha katta
ఇది కొంత రాసుకునే పూట
ఏవేవో రంగులేసుకునే కల
గాయాల మీద నడుస్తూ పోతే ఏ ఊరొస్తుంది. తీపిసలిపే గాలికి ఏం చెప్పాలి. ఇదేమీ వెతుకులాటల గీతం కాదు. పరామర్శల పాచికలాడేందుకు తెగిన హృదయాలకు చేతులుండవు. కన్నీళ్లకు మలుపులే కానీ మజిలీల ఊసుండదు.
ఏ గాలిపోర సర్రున కోసిపోతుందో అర్థం కాదు.
తల తెగిపడేవరకూ కత్తి పట్టుకుందేవరో బోధపడదు. ముద్దుచేసి తలుపులు తీయడమే హృదయాలకున్న జబ్బు. గుండెల్లో కూర్చోపెట్టుకున్న తర్వాత మనుషులు బరువు పెరుగుతారు.
లోపలి సావాసగాడా విను...
హృదయాలు మనుషుల్లో ఎగిరే చిట్టి పిల్లలు.
వాటికేడుపొస్తే అమ్మలుండరు. చీకటిగట్టు మీద కిచకిచమంటమే తెల్సు. అదో వెర్రి పాట. కన్నీళ్ల ఊట.
గాయాల వాడా...
నీ లోపలకి దర్జాగా నడువు. హృదయానికో ముద్దుపెట్టు. చీకటిముసురు మీద పాకుతున్న కళ్ళల్లోనే హాయిని పాడే పావురాలుంటాయి. గుండెల్ని తవ్వి దారిచ్చిన వాళ్ల దేహాల్లోనే దాహాలని తీర్చే నదులుంటాయి. కన్నీళ్లకూ నవ్వు తెప్పించే మార్మికతల యేరులుంటాయి.
పిచ్చివాడా ...
వెళ్తూవెళ్తూ నాలుగు నక్షత్రాలు తెంపుకుపో. తెల్లారికి మల్లెపూలవతాయి. దిగులు పడకు. పూలు మనుషులు కాదు. పొద్దుటకు సువాసన కొడతాయి. ... Siddhardha katta
31.5.2020, 11:18pm
[email protected]
Invited by: Sneha Reddy Konakati
if the data has not been changed, no new rows will appear.
Day | Followers | Gain | % Gain |
---|---|---|---|
August 18, 2023 | 575 | +2 | +0.4% |
November 23, 2022 | 573 | -5 | -0.9% |
September 14, 2022 | 578 | -2 | -0.4% |
July 31, 2022 | 580 | -2 | -0.4% |
June 24, 2022 | 582 | -31 | -5.1% |
May 18, 2022 | 613 | +1 | +0.2% |
April 10, 2022 | 612 | -1 | -0.2% |
February 11, 2022 | 613 | -5 | -0.9% |
November 27, 2021 | 618 | +7 | +1.2% |
October 19, 2021 | 611 | +19 | +3.3% |