తెలుగు సాహితీ విద్యార్థి.
"నీ సంతోషం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకు అలా అని నీ సంతోషాన్ని ఎవరు అయినా ఇబ్బంది పెడితే వారిని వదలకు"
నా జీవిత ఆకారం స్పష్టంగా..!!
"ఓంకారం"తో మొదలయ్యే సృష్టి
"ఆకారం" చుట్టుకున్న అమ్మ కడుపులో
"శ్రీకారం" చుట్టుకున్న జీవితానికి నేలపై
"మమకారం" పెంచుకున్న మనుషులతో...!!
"వెటకారం" ఏమాత్రము నాకు లేదు
"సహకారం" ఒక్కటే నాకు తెలిసిన విద్య
"సంస్కారం" నేను వేసుకున్న చొక్కా
"నమస్కారం" తో పలకరింపే పులకరింపు..!!
"తిరస్కారం" అనేది నా మనసులోనే లేదు
"చమత్కారం" తో మాటలేమో నేర్చిన
"ఉపకారం" చేయడమే తెలుసు
అపకారం ఎప్పుడు తలపెట్టలేదు...!!
"ఘింకారం" చెయ్యడంలో ఘనుడను
"ఝుంకారం" శబ్దాలతో పులకరించాను
"ప్రతీకారం" ఎప్పుడు కోరను
"ధిక్కారం" నా మాటల్లో వినపడదు....!!
"పురస్కారం" నా కవితకు చెందును
"సత్కారం" తో నా అక్షరం పులకించేను
"ప్రాకారం" నా జీవితానికి అద్దం
"అంధకారం" నాకు నేర్పింది విజ్ఞానం...!!
"గుణకారం" జీవితానికి సంబంధం
"అంగీకారం" ఉంటే మనుషుల మధ్య
"సహకారం" తో సాధన చేస్తుంటే
"పరిష్కారం" అన్నింటిలోనూ ఉండును...!!
నీలునాయుడు